నైజీరియా దేశంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లావాసి దుర్మరణం చెందారు.
జగదేవ్‌పూర్ (మెదక్): నైజీరియా దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లావాసి దుర్మరణం చెందారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లికి చెందిన చింతమడక(కుంట) సాయిలు(45) ఉపాధి కోసం నైజీరియా వెళ్లాడు. నాలుగేళ్ల నుంచి అక్కడ పని చేస్తుండగా... సోమవారం రాత్రి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిలు మృతి చెందాడు.
కాగా, సాయిలుకు భార్య బాలవ్వ, కూతురు కవిత, కుమారుడు భాస్కర్ ఉన్నారు. సాయిలు మృతదేహం ఎర్రవల్లి గ్రామానికి రావడానికి రెండు రోజుల సమయం పడుతుందని గ్రామస్తులు తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. సీఎంను కలువడానికి వారికి అనుమతి లభించలేదు.