హంతకుడి ఆచూకీ చెబితే రూ.12 లక్షలు | $20,000 reward to arrest killer of Indian-American | Sakshi
Sakshi News home page

హంతకుడి ఆచూకీ చెబితే రూ.12 లక్షలు

Jun 11 2015 6:09 PM | Updated on Sep 3 2017 3:35 AM

హంతకుడి ఆచూకీ చెబితే రూ.12 లక్షలు

హంతకుడి ఆచూకీ చెబితే రూ.12 లక్షలు

భారతీయ అమెరికన్ ప్రవీణ్ పటేల్(62) హత్య కేసును ఛేదించేందుకు లాస్ ఏంజెలెస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.



కాలిఫోర్నియా: భారతీయ అమెరికన్ ప్రవీణ్ పటేల్(62) హత్య కేసును ఛేదించేందుకు లాస్ ఏంజెలెస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హంతకుడికి సంబంధించిన సమాచారం అందిస్తే సుమారు రూ.12 లక్షలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. శాండిమాస్ ప్రాంతంలో శాండ్ విచ్ షాపు నడుపుతున్న ప్రవీణ్ పటేల్ జూన్ 2న హత్యకు గురయ్యారు. దుకాణంలో దొంగతనానికి వచ్చి దుండగుడు పటేల్ ను తుపాకీతో కాల్చి చంపాడు.

హత్య జరిగిన సమయంలో సెక్యురిటీ కెమెరాలు పనిచేయకపోవడంతో హంతకుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. హంతకుడు తెలుపు వర్ణంలో ఉన్నాడని, అతడి వయసు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్నాడని వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో అతడు బేస్ బాల్ టోపీ, బ్లాక్ టీషర్ట్ ధరించివున్నాడని తెలిపారు. అతడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.12 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement