రాఖీ కొనుగోలు చేసి ఇంటికి వస్తున్న ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ముజఫర్నగర్: రాఖీ కొనుగోలు చేసి ఇంటికి వస్తున్న ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గురూ 15, 16 ఏళ్ల మధ్యవారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బాధితురాలు ముజఫర్ నగర్లో రాఖీ తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా, నిందితులు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.