వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు డివైడర్ను ఢీకొని తిరగబడటంతో పది మంది విద్యార్థులు సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు డివైడర్ను ఢీకొని తిరగబడటంతో పది మంది విద్యార్థులు సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగింది. తొలుత అందరినీ ఆస్పత్రిలో చేర్చినా.. తర్వాత చికిత్స చేసి కొందరిని ఇళ్లకు పంపేశారు. ముగ్గురి పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడకపోవడంతో వారిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేయిస్తున్నారు. వారు ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడినట్లు వైద్యులు చెబుతున్నారు.
పశ్చిమ ఢిల్లీలోని ఖయాలా ప్రాంతంలో ఉదయం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పిల్లలందరికీ 6 నుంచి 18 ఏళ్లలోపు వయసుంటుంది. వారంతా పశ్చిమ ఢిల్లీలోని కేశవపురం నుంచి పంజాబీబాగ్ లోని పాఠశాలకు వెళ్తున్నారు. బస్సు డ్రైవర్ అమన్ దీప్ (19) కూడా గాయపడ్డాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు.