క్వారీలో కార్మికుడి మృతి | worker dead in karimnagar stone quarry | Sakshi
Sakshi News home page

క్వారీలో కార్మికుడి మృతి

Dec 2 2015 4:18 PM | Updated on Sep 3 2017 1:23 PM

కరీంనగర్ జిల్లాలో క్వారీలో పనిచేసే ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో క్వారీలో పనిచేసే ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వెలగట్టూరు స్టోన్ క్వారీలో పనిచేస్తున్న ఎల్లయ్య(45) అనే కార్మికుడు రాళ్లకు కంప్రెషర్ ద్వారా రంధ్రాలు వేస్తుండగా జారి కిందపడ్డాడు.

తీవ్రగాయాలైన ఎల్లయ్యను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే ప్రాణాలొదిలాడు. ఎల్లయ్య స్వస్థలం వెలగట్టూరు మండలం పైడిపల్లి గ్రామం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ ధరించకుండా పనులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెప్పుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement