మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిజాయతీ

Women Traffic Police Return Missing Purse Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: విధినిర్వహణలో ఉన్న సమయంలో తనకు దొరికిన పర్సును బాధితురాలికి అందజేసి ఓ మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిజాయతీ చాటుకుంది. బుధవారం ఉదయం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ జంక్షన్‌ వద్ద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లీశ్వరికి ఓ పర్సు కనిపించింది. అందులో రూ.5950 నగదు, రెండు ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించింది. పర్సులో ఉన్న ఒక స్లిప్పులో ఎస్‌బీఐ అకౌంట్‌ నెంబరు ఉండటంతో నంబర్‌ ఆధారంగా బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాదారు ఎన్‌. కవితగా గుర్తించిన ఆమె బ్యాంకు అధికారుల నుంచి నెంబరు తీసుకొని ఫోన్‌చేసింది. మంజీరా మాల్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తున్న కవిత తన నెలజీతాన్ని పర్సులో దాచుకుంది. పర్సు పోగొట్టుకొని ఆందోళనలో ఉన్న కవితకు పర్సును అందజేసి మల్లీశ్వరి నిజాయితీని చాటుకోవడంతో ఆమెను అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top