బాత్‌రూం గోడకూలి ఓ బాలింత మృతిచెందగా, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, ఆదివారం అనూషకు స్నానం చేయించేందుకు తల్లి మంజుల ఆమెను బాత్‌రూంకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి గోడలు నానిపోయి ప్రమాదవశాత్తు వారిపై కూలాయి. దీంతో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అనూష మృతిచెందింది.