టెర్మినల్ పేరు మార్పుపై నిలదీస్తాం : ఎంపీ కవిత | will ask TDP government to change Terminal Name of Shamshabad airport: Kavitha | Sakshi
Sakshi News home page

టెర్మినల్ పేరు మార్పుపై నిలదీస్తాం : ఎంపీ కవిత

Nov 23 2014 2:38 AM | Updated on Sep 2 2017 4:56 PM

టెర్మినల్ పేరు మార్పుపై నిలదీస్తాం : ఎంపీ కవిత

టెర్మినల్ పేరు మార్పుపై నిలదీస్తాం : ఎంపీ కవిత

శంషాబాద్‌లోని విమానశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని విమానశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ఎంపీలతో కలసి లోక్‌సభ సమావేశాల్లో కేంద్రప్రభుత్వాన్ని నిలదీ స్తామని ఆమె స్పష్టం చేశారు.  
 
 తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘానికి సంబంధించిన రెండు చీలిక వర్గాలతో 9గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన ఆమె రెండువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్టు ఆమె తెలిపారు. కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎ.కనకరాజు, ఎం.రాజిరెడ్డి, పాతకమిటీ అధ్యక్ష కార్యదర్శులు కె.మల్లయ్య, కోటి లింగంల వర్గాల మధ్య ఏడాది కాలంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించినట్టు ఆమె వివరించారు. ఈ రెండువర్గాలు విభేదాలు మరచి ఒకటయ్యాయని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement