ఫిరాయింపులపై అన్ని  వ్యవస్థలను కదిలిస్తాం: భట్టి

We will move all systems on party defects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులపై అన్ని వ్యవస్థలను కదిలిస్తామని, దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుపుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానిం చారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీలోకి వస్తే పోడు భూముల సమస్య, నాగార్జున ఎడమ కెనాల్‌ నీటి విడుదల చేస్తామనడం ఎంత సమంజసమని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పంట పొలాలకు నీరు ఇవ్వాలన్నందు కు ఎమ్మెల్యేలను పార్టీలో చేరమనడం దారుణమన్నారు

. ‘మా గుర్తుపై గెలిచిన వారిని చేర్చుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. మీకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారని ప్రశ్నిం చారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రతిపక్షాలను చీల్చుదామని ప్రలోభపెట్టడం మంచిదికాదన్నారు. రాష్ట్రాన్ని రాజ్యాంగ బద్దంగా పాలిస్తారా? మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? అని దుయ్యబట్టారు. గిరిజనులకు అటవీ భూములపై ఫారెస్టు యాక్ట్‌ తెచ్చి పట్టాలిస్తే, ఐదేళ్లలో ఆ భూములను  లాక్కొని ధ్వంసం చేశారని విమర్శించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top