హన్వాడ: పల్లెల్లో ఎన్నికల పండగ

Voters Festive Mood In Hanwada Village - Sakshi

సాక్షి, హన్వాడ: మండలంలో అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఆయా గ్రామాల్లో ఎన్నికల కో లాహలం కనిపించింది. ఏ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లినా ఓటర్లు బారులు తీరారు. మండల కేం ద్రంతోపాటు గొండ్యాల్, వేపూర్, ఇబ్రహీంబాద్, టంకర, చిన్నదర్పల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6గంటలు దాటింది. ఇదిలా ఉండగా మున్సిపల్‌ వార్డు, 19 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 43 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మాధారం, హన్వాడ, కొనగట్టుపల్లి, మునిమోక్షం పోలింగ్‌ కేంద్రాల్లో సల్ప ఆందోళనలు చోటుచేసుకున్నాయి. మాధారంలో 7గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఈవీఎం మొరాయించడంతో 8గంటలకు ప్రారంభమైంది. హన్వాడ 17, 18 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయడానికి వచ్చే వృద్ధులతో నేరుగా ఓటు వేయించినట్లు తెలియడంతో టీఆర్‌ఎస్, ఎన్‌సీపీ నాయకుల  మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలింగ్‌ సరళిని అభ్యర్థులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రశేఖర్, సురేందర్‌రెడ్డి, పద్మజారెడ్డి పరిశీలించారు. 
గండేడ్‌లో 63.5శాతం పోలింగ్‌ ..
గండేడ్‌: మండలంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 63.5శాతం పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు తెలిపారు. మండలంలో 69పోలింగ్‌ కేంద్రాల్లో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేష్‌రెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ కేంద్రాలను సందర్శిం చారు. మండలంలో అనేక మంది యువకులు మొదటిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూణె, ముంబై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు, గిరిజనులు శుక్రవారం ఉదయమే తమతమ గ్రామాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓటింగ్‌ పరికరాలను అ«ధికారులు ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top