విలువల పెంపుకోసమే ఎన్నికల్లో పోటీ

Values Based Contesting In Lok Sabha Election Said By Kodanda Ram - Sakshi

దుగ్గొండి/నల్లబెల్లి: రాజకీయాల్లో విలువలు పెం చడానికి జనసమితి పార్టీ మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా అరుణ్‌కుమార్‌ను పోటీలో ని లిపిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కో దండరాం అన్నారు. మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు.. ఎవరూ ఉండకూడదు..ప్రతిపక్షం పలకవద్దు.. అనే రీతిలో నేటి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.

ఆదివాసీల ముద్దుబిడ్డ, ఉన్నత విద్యావంతుడు, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన అరుణ్‌కుమార్‌ ట్రంకు పెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్‌ షేక్‌ జావిద్, మండల నాయకులు నామోజు మురళి, వరికెల బాబురావు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చట్టాలను పారదర్శకంగా అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రం లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top