‘ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతాం’

Uttam Kumar Reddy Teleconference With Booth Level Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బూత్‌ కమిటీ అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. రానున్న ఎన్నికల్లో బూత్‌ కమిటీ అధ్యక్షులే కీలకమని, త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో బూతు కమిటీ నాయకులతో సమావేశం ఉంటుందని తెలిపారు.  టీఆర్‌ఎస్‌ పాలనలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిరుద్యోగం, దాడులు, వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, ఫీజ్‌ రియంబర్స్‌మెంట్‌, తదితర హామీలను నెరవేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు పెరిగాయని బూత్‌ అధ్యక్షులు పేర్కొనగా.. అన్ని చిట్టా రాస్తున్నామని, అధికారంలోకి రాగనే తగిన గుణపాఠం చెబుదామని కార్యకర్తలకు ఉత్తమ్‌ ధైర్యం చెప్పారు.    
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top