మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వనపర్తి మండలం అంకూరులో విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతిచెందారు.
వనపర్తి : మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వనపర్తి మండలం అంకూరులో విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతిచెందారు.
సోమవారం బోరుబావిలో రైతులు మోటారు దించుతుండగా ప్రమాదవశాత్తూ పైపు, పైన ఉన్న కరెంటు తీగలు తగిలాయి. దీంతో బాలయ్య(51), ఆంజనేయులు(40) అనే రైతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటిరైతుకు సాయం చేయడానికి వెళ్లిన ఆంజనేయులు కూడా ప్రాణాలు కోల్పోయాడు. రైతుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకుంది.