ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు విషజ్వరాలతో ఇద్దరు మృతి చెందారు.
చెన్నూర్/ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రోజు విషజ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. చెన్నూర్‌లోని లైన్‌గడ్డ ప్రాంతానికి చెందిన తగరం మల్లేష్(40) స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని జైపూర్ చెక్‌పోస్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మృతిచెందినట్లు మల్లేష్ కుటుంబసభ్యులు తెలిపారు. మల్లేశ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య శంకరమ్మ ఉన్నారు.
అలాగే ఇంద్రవెల్లి మండలంలోని కొబ్బయ్‌గూడ గ్రామానికి చెందిన తొడసం బడిరాం (50) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం సాయంత్రం అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. బడిరాంకు భార్య దేవ్‌కబాయితోపాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.