విష జ్వరాల బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
గుండాల (ఖమ్మం) : విష జ్వరాల బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా గుండాల మండలంలోని కొలవకంచ గ్రామానికి చెందిన బి. రాము(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. దీంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం మృతిచెందాడు.
కాగా మండలంలోని చినవెంకటపురం గ్రామానికి చెందిన మల్లెల ఎరపాపయ్య(65) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ.. శనివారం మృతిచెందాడు.