ఆ ఇద్దరు దళితులు ఏమయ్యారు? | two dalit victims missing in bharath reddy case | Sakshi
Sakshi News home page

Nov 23 2017 3:34 PM | Updated on Oct 17 2018 6:06 PM

two dalit victims missing in bharath reddy case - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఘటన వెలుగుచూసి 12 రోజులు అవుతున్నా.. దళితులను దారుణంగా అవమానించిన బీజేపీ నేత భరత్‌రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు తాజాగా మరో పోలీసు బృందం రంగంలోకి దిగింది. దీంతో మొత్తం మూడు ప్రత్యేక బృందాలు భరత్‌రెడ్డి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

ఈ కేసులో అదృశ్యమైన ఇద్దరు దళిత బాధితులు ఆచూకీ కూడా తెలియడం లేదు. 11 రోజులైనా వారు కనిపించకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దళితులు ఇద్దరినీ భరత్ రెడ్డే కిడ్నాప్ చేయించాడని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. భరత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అజ్ఞాతంలో ఉన్న భరత్‌రెడ్డి స్థావరాలు మార్చుతూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన ఇద్దరు దళితులు కూడా భరత్ రెడ్డి వద్దే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దళితులు ఎంత వేడుకున్నా వినిపించుకోని అతను.. కర్రతో వారిని బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement