అమాయకుడ్ని తీసుకొచ్చి అవమానించారు.. | Tummala nageswara rao takes on rahul gandhi raith bharosa yatra | Sakshi
Sakshi News home page

అమాయకుడ్ని తీసుకొచ్చి అవమానించారు..

May 16 2015 1:56 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రపై తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రపై తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ రైతు భరోసా యాత్రలా కాకుండా... కాంగ్రెస్ మేలుకొలుపు యాత్రగా సాగిందని ఆయన శనివారమిక్కడ ఎద్దేవా చేశారు.

అమాయకుడిని తీసుకొచ్చి అవమానపరిచారని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకే ఆర్థిక సాయం చేశారని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత ఆత్మహత్యలు జరిగితేనే తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తుమ్మల అన్నారు. కాగా రాహుల్ ...ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement