
దేవరుప్పులలో సూర్యాపేట రహదారిలో వెళ్తున్న ఆర్టీసీ కార్గోబస్సు
దేవరుప్పుల: జనతా బంద్ నుంచి నేటి వరకూ లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రహదారుల వెంట అత్యవసర ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సులు కనిపించని నేపథ్యంలో శుక్రవారం జనగామ–సూర్యాపేట రహదారిలో ఆర్టీసీ కార్గో బస్సు కనిపించడంతో జనం ఆసక్తిగా చూశారు. హైదరాబాద్‌లోని కాచిగూడ డిపోకు చెందిన బస్సు ద్వారా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి అంగన్‌వాడీ కేంద్రాలకు బాలామృతం తదితర వస్తువులు తీసుకెళ్తున్నట్లు ఆర్టీసీ డ్రైవర్ పేర్కొన్నాడు.