ఎంపీ అరవిందును కలిస్తే తప్పేంటి..?

TRS MLA Ahmed Meets BJP MP Arvind sparking rumours of a Defection - Sakshi

అసెంబ్లీ ముచ్చట్లు...

అసెంబ్లీ లాబీలో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ వ్యాఖ్యలు  

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను పార్టీ మారితే బాగుండని మా పార్టీ నేతలే కొందరు ఆనందపడ్డారు. నేను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. సెపె్టంబర్‌ 17న ఓ మైనార్టీ ఎమ్మెల్యేగా బీజేపీలో చేరతానని ఎలా అనుకుంటారు’అని టీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ వ్యాఖ్యా నించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శనివా రం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పిచ్చాపాటీ గా మాట్లాడారు. ‘మా ఇంటి పక్కనే ఉండే నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరి్వంద్‌ను కలిస్తే తప్పేంటి. నేను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. గోడమీద పిల్లిలా ఉండను’ అని షకీల్‌ కామెంట్‌ చేశారు. నేను గతం లో బీజేపీ నిజామాబాద్‌ జిల్లా మైనార్టీ మోర్చాలో పనిచేశా. నా మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో నా మీద ఉన్న రెండు కేసుల్లో నిర్దోíÙగా నిరూపించుకున్నా. నా మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’అని షకీల్‌ ప్రకటించారు.

విప్‌ పదవితో గాంధీ సంతోషంగా లేరు
‘పదవులు రావాలని కోరుకోవడం.. రాకుంటే బాధ ఉండటం సహజం. అందరికీ పదవులు కావాలంటే సాధ్యం కాదు. మనలో ఎవరికి పదవులు వచి్చనా ఒకరికొకరు సహకరిం చుకోవాలి’అని మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనకు విప్‌ పదవి రావడం పట్ల హ్యాపీగా లేరు. మంత్రి కావాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసి తుమ్మల నాగేశ్వర్‌రావు తన ఇంటికి పిలిచి మంద లించారు. కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవితోపాటు విప్‌ పదవి కూడా ఇచ్చారు. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలి తప్ప రచ్చ చేసుకోవద్దని చెప్పారు. ఎవరికి పదవి వచి్చనా జిల్లాలో అందరినీ కలుపుకుపోవాలని చెప్పామని భాస్కర్‌రావు వ్యాఖ్యానించారు.
– ఎమ్మెల్యే భాస్కర్‌రావు

నారదాసు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు
‘టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓనర్లు ఎవరు’ అనే అంశంపై ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న కామెంట్లు.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లోనూ ప్రస్తావనకు వస్తున్నాయి. అసెంబ్లీ లాబీలో ఎదురైన మీడియా ప్రతినిధులు ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు అనే ది అప్రస్తుతమని’ ఇటీవల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు చేసిన కామెంట్లను ప్రస్తావించారు. రామలింగారెడ్డి స్పందిస్తూ.. నక్సలిజం భావజాలం నుంచి వచి్చన నారదాసు అలా మాట్లాడటం కరెక్ట్‌గా లేదనే విషయాన్ని ఆయనకు ఫోన్‌ చేసి చెప్పానన్నారు. తన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వక్రీకరిస్తున్నారని సమాచారం అం దడంతో అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులకు లింగ వివక్ష ఉండదు. ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దు’అని కోరారు.
– ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top