గ్రేటర్‌పై టీఆర్‌ఎస్ కన్ను | TRS looking for Greater elections | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై టీఆర్‌ఎస్ కన్ను

Aug 5 2014 12:37 AM | Updated on Mar 18 2019 9:02 PM

గ్రేటర్‌పై టీఆర్‌ఎస్ కన్ను - Sakshi

గ్రేటర్‌పై టీఆర్‌ఎస్ కన్ను

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు యత్నాలు ఆరంభమయ్యాయి. సోమవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ కార్పోరేటర్ రావుల శేషగిరి,

 హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు యత్నాలు ఆరంభమయ్యాయి. సోమవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ కార్పోరేటర్ రావుల శేషగిరి, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంట సిద్ధిరాములు, దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధయ్యలు టీఆర్‌ఎస్ కుత్బుల్లాపూర్ ఇన్‌చార్జి శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇటీవలే మండల పరిధిలోని ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు పార్టీలో చేరగా గ్రేటర్ పరిధిలో మరో 30 మందిని వారం రోజుల్లో పార్టీలో చేర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గ్రేటర్ పరిధిలో మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు దృష్టి సారించి చేరికలకు రంగం సిద్ధం చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, మాజీ  ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement