
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డికి నివేదిక అందజేసింది. ఐదు రోజులుగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ శనివారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దనరెడ్డికి అధ్యయన రిపోర్ట్‌ను ఇచ్చింది. త్రిసభ్య కమిటీతో భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ రిపోర్ట్ ఆధారంగా అవకతవకలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు 50వేల దరఖాస్తులు అందాయని.. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించామని తెలిపారు.
చదవండి : ‘గ్లోబరీనా’దే గోల్‌మాల్!