కారు బోల్తా : ముగ్గురికి గాయాలు | three injured in accident in chennur | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : ముగ్గురికి గాయాలు

Feb 14 2018 3:04 PM | Updated on Sep 28 2018 3:39 PM

three injured in accident in chennur - Sakshi

కారును లేపుతున్న ప్రయాణికులు 

భీమారం(చెన్నూర్‌) : పెద్దపల్లి జిల్లా సు ల్తానాబాద్‌ నుంచి మంచిర్యాల జిల్లా చె న్నూరు మండలం కత్తెరశాల మల్లన్న జాతరకు కారులో వెళ్తుండగా భీమారం జోడువాగుల వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. ముందు వెళ్తున్న ట్రాలీఆటోను ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదు పు తప్పి రెండు పల్టీలు కొట్టడంతో ము గ్గురు గాయపడ్డారు. మహాశివరాత్రి సం దర్భంగా కత్తెరశాల మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగే జాతరలో బోనాలు పోసుకొనేందుకు సుల్తానాబాద్‌కు చెంది న బాకం సంపత్‌ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు. భీమారం వద్ద పండ్ల లోడుతో ముందు వెళ్తున్న ఆటోను తప్పించి ముందుకు వెళ్లే క్రమంలో కారు అదుపు కాకపోవడంతో ఆటో ను ఆటోను ఢీ కొట్టింది. ఇందులో కారు నడుపుతున్న యజమాని సంపత్, తల్లి మల్లమ్మ, సమ్మక్కకు తలతోపాటు కాళ్ల కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement