నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
ఖమ్మం: మనం మామూలుగా ఒక కాన్సులో ఒకరు లేదా ఇద్దరు మహా అయితే ముగ్గురు శిశువులు జన్మించారని విన్నాం. అయితే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్సులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. తిరుమలాయపాలెం మండలానికి చెందిన శామీన అనే మహిళ పురిటినొప్పులతో స్థానిక జోయా ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ స్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు నలుగురు శిశువులు జన్మించిన్లు తెలిపారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, చిన్నారుల్లో ముగ్గురు మగశివువులతో పాటు ఆడబిడ్డ ఉన్నట్లు వైద్యులు చెప్పారు.