గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరి శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామానికి చెందిన మచ్చ కృష్ణ(40) వలిగొండ మండలం సంగెం గ్రామంలో విద్యుత్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం సాయంత్రం బైక్‌పై భువనగిరి వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి, వెళ్లిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావటంతో కృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు.