చెరకు రైతుల చర్చలు విఫలం | the negotiations failed of sugarcane farmers | Sakshi
Sakshi News home page

చెరకు రైతుల చర్చలు విఫలం

Nov 6 2014 1:11 AM | Updated on Oct 20 2018 5:55 PM

చెరకు మద్దతు ధరపై గణపతి షుగర్స్ యాజమాన్యంతో బుధవారం రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

 సాక్షి, సంగారెడ్డి:  చెరకు మద్దతు ధరపై గణపతి షుగర్స్ యాజమాన్యంతో బుధవారం రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ధర విషయంలో తేలకున్నా యాజమాన్యం మాత్రం క్రషింగ్‌కు మిగతా 2వ పేజీలో ఠచెరకు రైతుల చర్చలు విఫలం సన్నద్ధమవుతోంది. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని గణపతి షుగర్స్ పరిశ్రమలో కంపెనీ డెరైక్టర్ నందకుమార్, జీఎం బాబుతో చెరకు రైతులు, భారతీ కిసాన్‌సంఘ్ ప్రతినిధులు చెరుకు మద్దతు ధరపై చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో రైతు సంఘాల ప్రతినిధులు టన్ను చెరకు రూ.3,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే గణపతి షుగర్స్ యాజమాన్యం మాత్రం టన్నుకు రూ.2,600 చెల్లిస్తామని చెప్పింది. దీంతో రైతు ప్రతినిధులు చర్చలను బహిష్కరించారు. అయితే గణపతి షుగర్స్ యాజమాన్యం మాత్రం చెరకు క్రషింగ్‌కు సిద్ధమవుతోంది.

 గణపతి యాజమాన్యంతో జరిగిన చర్చల సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పి.నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, గణపతి చక్కెర కర్మాగారం పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేశారని, ప్రస్తుతం మద్దతు ధర కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో మద్దతు ధర లభించలేదని, ప్రస్తుతం చెరకు సాగు వ్యయం పెరిగిన నేపథ్యంలో చెరకు మద్దతు ధర టన్నుకు రూ.3,500 చెల్లించాలని గణపతి యాజమాన్యాన్ని కోరారు.

 కరెంటు కోతలు, వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులు చెరకు సాగు చే శారని, వారికి న్యాయం చేయాలని కోరారు. గణపతి షుగర్స్ ప్రతినిధులు మాత్రం రూ.2,600 చెల్లిస్తామనడం బాధాకరమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గణపతి షుగర్స్ పరిధిలో చెరకు మద్దతు ధర చెల్లింపు విషయమై రైతు ప్రతినిధులకు, యాజమాన్యానికి మధ్య మరోమారు చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

 కలెక్టర్ రాహుల్ బొజ్జా  మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్‌లోని మూడు చక్కెర పరిశ్రమల పరిధిలోని రైతుల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో చెరుకు మద్దతు ధరపై పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 11న ముహూర్తం, 13 నుంచి క్రషింగ్
 చెరకు మద్దతు ధర ఖరారు కానప్పటికీ సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని గణపతి షుగర్స్ క్రషింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న చెరకు క్రషింగ్‌కు ముహూర్తం చేసి ఆ తర్వాత 13వ తేదీ నుంచి చెరకు క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 13 నుంచి క్రషిం గ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న గణపతి షుగర్స్ చెరకు సేకరిం చేందుకు సన్నద్ధమవుతోంది. కాగా క్రషింగ్ ప్రారంభానికి ముందే  యా జమాన్యం మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement