సంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకు,న్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కాలంగా సంగారెడ్డి టౌన్ పీఎస్‌లో సందీప్ విధులు నిర్వర్తిస్తున్నాడు.
వ్యక్తిగత కారణాల వల్లే సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే సందీప్ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
