తెలంగాణకు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ ముందుకు వచ్చింది. 2017 నుంచి ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపింది.
2017 నుంచి ఇచ్చేందుకు అంగీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ ముందుకు వచ్చింది. 2017 నుంచి ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపింది. ఈ వేయి మెగావాట్ల విద్యుత్‌పై త్వరలో దీర్ఘకాలానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. వారం రోజుల్లోగా పీపీఏ కుదిరే అవకాశం ఉంది.