
'షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడతారు'
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఉదయం లోటస్ పాండ్లో మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు వస్తున్న షర్మిలకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. నేటి నుంచి వైఎస్ షర్మిల తెలంగాణలో పరామర్శ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.