గాంధీలో కరోనా వార్డు వద్దంటూ స్థానికుల లేఖ

Telangana High Court Heaing On CoronaViral Pill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై హైకోర్టులో దాఖలైన పిల్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ విచారణలో అధికారుల పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు స్టేట్‌ లెవల్‌, జిల్లా లెవల్‌ కమిటీలను నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రజలకు ఉచితంగా మాస్క్‌లు ఇస్తున్నామని, కరోనాపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొంది. అనంతరం బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్‌ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉచితంగా మందులు, మాస్క్‌లు అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై రివ్యూ చేస్తామని దర్మాసనం తెలిపింది. కేరలకు పది మందితో కూడిన వైద్యుల బృందం వెళుతుందని వైద్యాధికారులు హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.(‘తూర్పు’న కరోనా కలకలం)

తెలంగాణ 33 జిల్లాల పారామెడికల్ ఆఫీసర్లతో డైరెక్టర్ హెల్త్ సమావేశం నిర్వహించారు. పారామెడికల్ ఆఫీసర్లతో డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. గతంలో వచ్చిన వైరస్‌లన్నింటిని తగ్గించామని, జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులకు తావివొద్దని ఆదేశించారు. మరోవైపు గాంధీ  ఆస్పత్రిలో కరోనా వార్డు వద్దంటూ.. సూపరిండెంట్‌కు స్థానికలులు లేఖ రాశారు. అదే లేఖను మంత్రికి కూడా పంపారు. కరోనా వల్ల చుట్టుపక్కల వాళ్లంతా బయపడుతున్నామని పద్మనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 
(కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని)

మాస్క్‌.. అవుటాఫ్‌ స్టాక్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top