గొంతుకోసి మహిళ హత్య  | Suspicious murder of a house wife | Sakshi
Sakshi News home page

గొంతుకోసి మహిళ హత్య 

Feb 13 2019 2:46 AM | Updated on Feb 13 2019 2:46 AM

Suspicious murder of a house wife - Sakshi

రాణెమ్మ మృతదేహం

మునిపల్లి (అందోల్‌): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి హత్యకు గురైంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ల్యాగల శ్రీనివాస్‌కు కల్లపల్లి బెల్లూర్‌కు చెందిన నాగొల్ల రాణెమ్మ(32)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్‌ కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాగి ఇంటికి చేరుకున్నాడు.

మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌ నిద్రకు ఉపక్రమించాడు. రాణెమ్మ పిల్లలను పడుకోబెట్టి తానూ పడుకుంది. కాగా, ఉదయం లేచి తన భార్యను కొడవలితో ఎవరో గొంతుకోసి హత్య చేశారని శ్రీనివాస్‌ రోదించడం మొదలుపెట్టాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు శ్రీనివాస్‌పై అనుమానంతో అతడిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రాణెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌కు మద్యం అలవాటు ఉందని, గతంలో మద్యం మత్తులో తన కాలు కోసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్‌ను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement