సరి‘హద్దు’ దాటిన టిక్‌టాక్‌ ప్రేమ

Siddipet Tik Tok Duo Desires To Marry Anantapur Youth - Sakshi

బొమ్మనహాళ్‌: టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన యువకులను పెళ్లి చేసుకునేందుకు అనంత పురం జిల్లా బొమ్మనహాళ్‌కు వచ్చిన ఇద్దరు తెలంగాణ యువతులను పోలీసులు ఆదివా రం వారి తల్లిదండ్రుల వెంట పంపారు.  సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌ మండలం ముక్తమా సనపల్లి గ్రామానికి చెందిన సౌందర్య, మమత అనంతపురం జిల్లా బొమ్మన హాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన వన్నూరు స్వామి, వంశీలకు టిక్‌టాక్‌లో పరిచయమ య్యారు.  అది ప్రేమగా మారింది. దీంతో యువతులిద్దరూ ఈ నెల 7న దర్గా హొన్నూరు గ్రామానికి చేరుకుని తమను వివాహం చేసుకో వాలని యువకులను పట్టుబట్టారు.
(చదవండి : పెళ్లి చేసుకున్న టిక్‌టాక్‌ జోడీ )

గ్రామ స్తులు జోక్యం చేసుకుని యువతులిద్దరికీ సర్దిచెప్పి వారి స్వస్థలానికి పంపించే ప్రయ త్నం చేసినా వారు వినిపించుకోలేదు. దీంతో ప్రేమ పంచాయతీ బొమ్మనహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ఎస్‌ఐ రమణారెడ్డి యువతు లతో మాట్లాడి వారిని కళ్యాణ దుర్గంలోని ఉజ్వల హోంకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువతుల తల్లిదండ్రులు ఆదివారం బొమ్మనహాళ్‌  పోలీస్‌ స్టేషన్‌కు రాగా.. యువతులిద్దరికీ నచ్చజెప్పి వారి తల్లిదండ్రుల వెంట పంపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top