'కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహారిస్తోంది' | Shabbir Ali takes on kcr govt | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహారిస్తోంది'

Jan 21 2015 1:28 PM | Updated on Aug 16 2018 3:23 PM

'కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహారిస్తోంది' - Sakshi

'కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహారిస్తోంది'

రాష్ట్రంలో విజృంభిస్తుంటే స్వైన్ ఫ్లూ పై కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరిస్తోందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరిస్తోందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతుందని 15 రోజుల క్రితమే హెచ్చరించినప్పటికీ కేసీఆర్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆయన విమర్శించారు.

స్వైన్ ఫ్లూ మరణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వైన్ ఫ్లూ నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement