సర్పంచ్‌ల మెడపై .. ‘ప్రణాళిక’ కత్తి! 

Sarpanch Facing Pressure Regarding Thirty Days Plan In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : గ్రామ  పంచాయతీల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలును ప్రభుత్వం సీరి యస్‌గా తీసుకుంటోంది. ఈ కార్యక్రమ నిర్వహణలో అలసత్వం వహిస్తున్న పంచాయతీ పాలకమండళ్లు, గ్రామ కార్యదర్శులను బాధ్యులను చేసి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది. కార్యక్రమం అమలు తీరు ఎలా ఉంది..? స్థానిక ప్రతినిధుల భాగస్వామ్యం ఎలా ఉంటోంది. సర్పంచులు, ఉప సర్పంచులు, ఆయా పంచా యతీల కార్యదర్శుల పనితీరు ఎలా ఉంది..? ముప్పై రోజుల ప్రణాళికలో ఎవరు ఉత్సాహంగా పాల్గొంటున్నారు..? ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు... అన్న అంశాల్లో వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ జిల్లా వ్యాప్తంగా పర్యటించి వివరాలు సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తోంది.

ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యదర్శుల మెడలపై కత్తి వేలాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  కాగా, ప్రణాళిక అమలు విషయంలో నిర్లక్ష్యం వహించిన పలు వురిపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  30 రోజుల ప్రణాళికలో ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మురుగు కాల్వలు శుభ్రం చేయాలి. విద్యుత్‌ సమస్యల పరిష్కారంతో పాటు హరిత హారంలో మొక్కలు నాటాలి.

శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులకు స్థలాల ను గుర్తించాలి. ఈ నెల 6వ తేదీ నుంచి జరుగుతున్న ప్రణాళికలో అధికారులు, పంచాయతీల సర్పంచులు పాల్గొని అభివృద్ధి ప్రణాళిక తయా రు చేసుకోవాల్సి ఉంది. కాగా, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కొందరని టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. వీరిలో సర్పంచ్‌లు,ఉపసర్పంచ్‌లు , కొందరు కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు.

30 రోజుల ప్రణాళికలో ప్రగతి కనిపించాల్సిందే 
30 రోజుల ప్రణాళికలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, కచ్చితంగా అభివృద్ధి కనిపించాలని కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పేర్కొన్నారు. మరోవైపు ఆయన  మంగళవారం తిప్పర్తి మండలం మామిడాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణాళిక విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముప్‌పైరోజుల ప్రణాళికలో ఏం చేశామనేది ప్రగతిలో కనిపించాలని కార్యక్రమాలు ఏమేరకు జరిగాయనే విషయాన్ని ఏ రోజుకారోజు నివేదికలు అందించాల్సిందే అన్నారు.

ఏం పనిచేశామో అది కనిపించనప్పుడు  పనిచేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, కొత్తచట్టం ప్రకారం నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటిదాకా జిల్లా వ్యా ప్తంగా  గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరిగాయి.  పవర్‌ వీక్‌ పనులు కొనసాగుతున్నాయి. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలకు ఇప్పటికే సగం గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మిగిలిన స్థలాలను కూడా ఈ నెల చివరి నాటికి గుర్తించాలని కలెక్టర్‌ అన్ని గ్రామాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
-కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top