కృష్ణానదిలో తేలిన పురాతన సంగమేశ్వరాలయం | sangameshwara temple lifted in krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో తేలిన పురాతన సంగమేశ్వరాలయం

Feb 21 2017 3:06 AM | Updated on Sep 5 2017 4:11 AM

నీట తేలిన ఆలయం.. (ఇన్‌సెట్‌లో) ఆలయంలో పూజలు చేసున్న శివమాలధారులు

నీట తేలిన ఆలయం.. (ఇన్‌సెట్‌లో) ఆలయంలో పూజలు చేసున్న శివమాలధారులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల సమీపంలోని కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయం తేలింది...

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల సమీపంలోని కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయం తేలింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ గుడి పూర్తిగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన విషయం విదితమే. తూర్పుభాగంలోని గర్భగుడిలో మోకాళ్లలోతు వరకూ ఇంకా నీళ్లు ఉన్నాయి.

వారం రోజులుగా నీటి మట్టం భారీగా తగ్గడంతో గుడి పడమటి భాగం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ అర్చకులు రఘురామశర్మ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం శివమాలధారులు గర్భగుడిలోని వేపలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement