ఆరోగ్యశ్రీలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లను 21 రోజుల్లో పరిష్కరించాలని లేదంటే ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం శుక్రవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చింది.
సమస్యలు పరిష్కరించకుంటే 24 అర్ధరాత్రి నుంచి సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లను 21 రోజుల్లో పరిష్కరించాలని లేదంటే ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం శుక్రవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలకు రూ.15 వేలు వేతనం, రవాణా భత్యం ఇవ్వాలని, నెట్‌వర్క్ ఆరోగ్యమిత్రలకు రూ.18 వేలు, బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని, ఆఫీసు ఎగ్జిక్యూటివ్, ట్రస్టు కార్యాలయంలో పనిచేసే డీఈవోలకు రూ.20 వేలు, బస్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు వయో పరిమితి సడలించాలన్నారు.