samme sairan
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల సమ్మె సైరస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వెళ్లనున్నట్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నిర్ణయం తీసుకుంది. కాగా, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. 14వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు కుర్మన్నపాలెంలో రాస్తా రోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతును కార్మికులు కోరుతున్నారు. ఇదే సమయంలో ఏడో తేదీన మరోసారి ఆర్ఎల్సీతో చర్చలు జరపనున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్ కార్మికులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇక, యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినటఉట తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరిగింది. స్టీల్ ప్లాంట్ మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు. -
ఆరోగ్యశ్రీలో సమ్మె సైరన్
సమస్యలు పరిష్కరించకుంటే 24 అర్ధరాత్రి నుంచి సమ్మె సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లను 21 రోజుల్లో పరిష్కరించాలని లేదంటే ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం శుక్రవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. పీహెచ్సీ ఆరోగ్య మిత్రలకు రూ.15 వేలు వేతనం, రవాణా భత్యం ఇవ్వాలని, నెట్వర్క్ ఆరోగ్యమిత్రలకు రూ.18 వేలు, బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని, ఆఫీసు ఎగ్జిక్యూటివ్, ట్రస్టు కార్యాలయంలో పనిచేసే డీఈవోలకు రూ.20 వేలు, బస్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు వయో పరిమితి సడలించాలన్నారు.