మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌లో దుండగులు దోపిడీకి తెగబడ్డారు.
నారాయణపేట్: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌లో దుండగులు దోపిడీకి తెగబడ్డారు. కర్రలతో బెదిరించి నలుగురు దుండగులు ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. పశు వైద్యుడిగా పనిచేసే అనిరుధ్ ఆచార్య నారాయణపేట్ సమీపంలోని కోట వద్ద నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారు జామున నలుగురు వ్యక్తులు కర్రలు, ఫోకస్ లైట్‌లతో ఇంట్లోకి దూరి అనిరుధ్ కుటుంబ సభ్యులను బెదిరించారు. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. దీనిపై బాధితులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవీంద్రప్రసాద్ తెలిపారు.