రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు.
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. సీఓఆర్డీ యుగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాంపెల్లి గ్రామంలోని 15 అక్రమ లే అవుట్ల సరిహద్దు రాళ్లను తొలగించడంతో పాటు అక్రమ లే అవుట్ల ప్రహరీలను కూల్చివేశారు.
అలాగే, దమ్మాయిగూడ, నాగారం, కీసర, అహ్మద్‌గూడ, చేర్యాలలోని అక్రమ లే అవుట్లపై కూడా రెండు రోజుల్లోపల చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ లే అవుట్లపై జాయింట్ కలెక్టర్ ఆమ్రపాల్‌కు ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు చేపట్టారు.