‘డబుల్‌’కు 20 వేల కోట్లు కేటాయించాలి | revanth reddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’కు 20 వేల కోట్లు కేటాయించాలి

Feb 21 2017 2:54 AM | Updated on Sep 29 2018 4:44 PM

‘డబుల్‌’కు 20 వేల కోట్లు కేటాయించాలి - Sakshi

‘డబుల్‌’కు 20 వేల కోట్లు కేటాయించాలి

రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మిం చేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి
సాక్షి, నిర్మల్‌: రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మిం చేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం టీటీడీపీ ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా నిర్మ ల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా నిర్మల్‌లోనే ఇప్పటికీ డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మాణానికి నోచుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ మాట్లా డుతూ మంత్రుల నియోజకవర్గాల్లో ప్రజాపోరు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్, అరవింద్‌కుమార్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, సతీష్‌మాదిగ, రాథోడ్‌ రమేష్, లోలం శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా పెట్టుబడిదారుల సేవలో సీఎం
భిక్కనూరు: సీఎం కేసీఆర్‌ ఆంధ్రా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల సేవలో తరిస్తున్నారని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌గేట్‌ వద్ద పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.   నిరుద్యోగ ర్యాలీకి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement