300 ఎంబీబీఎస్‌ సీట్ల పునరుద్ధరణ | Renovation of 300 MBBS seats | Sakshi
Sakshi News home page

300 ఎంబీబీఎస్‌ సీట్ల పునరుద్ధరణ

Apr 13 2017 12:01 AM | Updated on Oct 9 2018 5:50 PM

300 ఎంబీబీఎస్‌ సీట్ల పునరుద్ధరణ - Sakshi

300 ఎంబీబీఎస్‌ సీట్ల పునరుద్ధరణ

రాష్ట్రంలో అనుమతి నిరాకరించిన 300 ఎంబీబీఎస్‌ సీట్లను పునరుద్ధరిం చడానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) ఎట్టకేలకు అంగీకరించింది.

రద్దు చేసిన సీట్ల భర్తీకి ఎంసీఐ ఆమోదం
2017–18 అడ్మిషన్లలో ఆ మూడు కాలేజీ సీట్లు యథాతథం
కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన 50 సీట్లపై సందిగ్ధత


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనుమతి నిరాకరించిన 300 ఎంబీబీఎస్‌ సీట్లను పునరుద్ధరిం చడానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) ఎట్టకేలకు అంగీకరించింది. నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పిస్తామం టూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన హామీపత్రంతో సీట్ల పునరుద్ధరణకు ఎంసీఐ అంగీకరించింది.

 దీంతో ఉస్మానియా మెడికల్‌ కాలేజీలోని 50, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలోని 100, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన 150 సీట్లను యథా విధిగా ఈ ఏడాది భర్తీ చేసుకోవడానికి అవకాశం చిక్కిం ది. కాకతీయ మెడికల్‌ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్‌ సీట్లను పునరుద్ధరించే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి ఎంసీఐ సమావేశంలో కాకతీయ మెడికల్‌ కాలేజీ సీట్లపై నిర్ణయం తీసుకుంటారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ సీట్లపై సందిగ్ధత కొనసాగుతోంది.   సిబ్బంది కొరతే కారణం..

ప్రతీ ఏటా ఎంసీఐ తనిఖీలు నిర్వహిస్తుంటుం ది. మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వసతులు లేకపోవడంతో అనేక సందర్భాల్లో సీట్ల రద్దు జరుగుతోంది. అందులో భాగంగానే పై 4 కాలేజీల సీట్ల భర్తీకి ఎంసీఐ నిరాకరించింది. ఎంసీఐ తనిఖీల్లో కాకతీయ మెడికల్‌ కాలేజీలో 19.06 శాతం బోధనా సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో 30.85 శాతం బోధనా సిబ్బంది కొరత ఉందని తేల్చారు. 17.02 శాతం రెసిడెం ట్‌ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది.

ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్‌ సూపరింటెం డెంట్‌గా నియమించారు. రెండుచోట్లా బోధన సిబ్బందికి నివాస సదుపాయం పూర్తిస్థాయిలో లేదు. ఉస్మానియా, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేవు. సీట్ల రెన్యువల్‌ సమయంలో ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పుడు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బం ది సగానికి మించి ఉండటం లేదన్న విమర్శలు న్నాయి.

ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పుడు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు సహా అధ్యాపక సిబ్బందిని తాత్కాలికంగా తీసుకొచ్చి ఎం సీఐని పక్కదారి పట్టిస్తున్న స్థితి ఉందన్న ఆరో పణలున్నాయి. దీంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు దినదినగండంగా మారిం ది. ఏటా ఎంసీఐ తనిఖీలకు రావడం.. పలు లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement