నేడు రాహుల్, రేపు మన్మోహన్ ప్రచారం | Rahul gandhi, Manmohan singh to canvas in Warangal, Hyderabad today | Sakshi
Sakshi News home page

నేడు రాహుల్, రేపు మన్మోహన్ ప్రచారం

Apr 25 2014 2:35 AM | Updated on Aug 14 2018 4:32 PM

నేడు రాహుల్, రేపు మన్మోహన్ ప్రచారం - Sakshi

నేడు రాహుల్, రేపు మన్మోహన్ ప్రచారం

కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం రాహుల్ గాంధీ, శనివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు.

వరంగల్, హైదరాబాద్‌ల్లో రాహుల్ సభలు... భువనగిరిలో ప్రధాని సభ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం రాహుల్ గాంధీ, శనివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లా మండికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
 
 అక్కడి నుంచి నగరంలోని ఎల్‌బీ స్టేడియం బహిరంగ సభలో పాల్గొని తిరిగి రాత్రి 7 గంటలకు బయలుదేరి వెళ్లిపోతారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భువనగిరి వెళ్తారు. అక్కడ బహిరంగసభలో పాల్గొని తిరిగి సాయంత్రం ఢిల్లీ వెళ్లిపోతారు. 27న సోనియాగాంధీ ఆందోల్‌లో ప్రచారానికి రానున్నారు. అయితే పీసీసీ విజ్ఞప్తి మేరకు ఆమె అదే రోజు చేవెళ్ల సభలో కూడా పాల్గొనడానికి అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement