ఐదు కొత్త జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు!

ఐదు కొత్త జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు! - Sakshi


కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు

ఒక్కో పాలిటెక్నిక్‌కు రూ.12.3 కోట్లు

2018–19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
 



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలను మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. సబ్మిషన్‌ స్కీం ఆఫ్‌ పాలిటెక్నిక్స్‌ కింద కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక్కో పాలిటెక్నిక్‌ ఏర్పా టుకు రూ. 12.3 కోట్ల చొప్పున మంజూరు చేయ నుంది. ఇందులో పాలిటెక్నిక్‌ల భవన నిర్మాణాలకు రూ. 8 కోట్ల చొప్పున, పరికరాలు, వసతుల కల్పనకు రూ. 4.3 కోట్ల చొప్పున నిధులను ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 5 జిల్లాల్లో పాలిటెక్నిక్‌లు లేవు.



మహబూబాబాద్‌ ఆసిఫాబాద్, నాగర్‌ కర్నూలు, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త పాలిటెక్నిక్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాద నలు సిద్ధం చేస్తోంది. అవి పూర్తి కాగానే కేంద్రానికి అందజేయనుంది. కేంద్రం నుంచి ఆమోదం లభించ గానే 2018–19 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేనుంది. కొత్తగా ఏర్పాటు చేసే పాలి టెక్నిక్‌లకు అవసరమైన భూమి, వాటిల్లో నియమించే అధ్యాపకుల జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిం చాల్సి ఉంటుంది. కొత్తగా రానున్న 5 పాలిటెక్నిక్‌లలో 3 చొప్పున (సివిల్, ఎలక్ట్రికల్, మరొకటి) కోర్సులను ప్రవేశపెట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.



ఈ ఏడాది నుంచే హుస్నాబాద్‌ పాలిటెక్నిక్‌లో తరగతులు

హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 2017–18 విద్యా సంవత్సరం నుం చే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22న నిర్వహించనున్న పాలీసెట్‌–2017 ద్వారా ఆ కాలేజీలో సివిల్‌లో 60 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 60 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హుస్నా బాద్‌ పాలిటెక్నిక్‌కు ఏఐసీటీఈ ఆమోదం తెలి పింది. ఈ విద్యా సంవత్సరంలో హుస్నాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌ పాలిటెక్నిక్‌లో తరగతుల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపింది. సికింద్రాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు సొంత భవనం లేకపోవడంతో 2017–18లో ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top