వచ్చే వారం పోలీస్‌ నోటిఫికేషన్‌!  | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 25 2018 2:00 AM

Police Recruitment Will Begins On Next Week In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటంతో వచ్చే వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే కసరత్తు 90% పూర్తిచేసినట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొత్తం 22వేల పోస్టులకు అనుమతులు వచ్చినా అందులో ముందుగా పోలీస్‌శాఖలోని 18వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 4వేల పోస్టులు జైళ్లు, అగ్నిమాపక, ఆర్టీసీ, తదితర విభాగాలకు చెందినవి ఉన్నాయని, వీటి నియామక ప్రక్రియ వేరే విధంగా ఉంటుందని బోర్డు అధికారులు చెప్పారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement