తమ పిలుపు మేరకు బంద్ పాటించకపోవడంతో ఓ పాఠశాలపై విద్యార్థి సంఘం నాయకులు దాడి చేసిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది.
సూర్యాపేట (నల్లగొండ): తమ పిలుపు మేరకు బంద్ పాటించకపోవడంతో ఓ పాఠశాలపై విద్యార్థి సంఘం నాయకులు దాడి చేసిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పీడీఎస్‌యూ(విజృంభణ) విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పాఠశాలల బంద్‌కు పిలుపు నిచ్చింది. అయితే, పట్టణంలోని నవోదయ ఉన్నత పాఠశాల యథావిధిగా నడిపించారు. దీంతో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకొని... తాము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుంటే పాఠశాల ఎందుకు నడిపిస్తున్నారంటూ దాడి చేశారు. ఫర్నిచర్, అద్దాలు, కంప్యూటర్‌లను ధ్వంసం చేశారు.