ముగిసిన రెండో విడత  నామినేషన్ల ఘట్టం

Panchayat Elections Notifications Ends Nalgonda - Sakshi

మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కావడంతో మూడు రోజుల పాటు కొనసాగింది. రెండోవిడత మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో 276 సర్పం చ్‌లకు, 2,376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లోఉన్న 276 గ్రామ పంచాయతీలకు 2,298 మంది నామినేషన్లు వేయగా 2,376 వార్డు సభ్యులకు గాను 6,783 మంది నామినేషన్లు వేశారు.

అత్యధికం - అత్యల్పం..
రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల్లో అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో సర్పంచ్‌లకు 337 నామినేషన్లు వచ్చాయి. మిర్యాలగూడ మండలంలోని వార్డు సభ్యులకు అత్యధికంగా 1,142 నామినేషన్లు వచ్చాయి. కాగా అతి తక్కువగా వేములపల్లి మండలంలోని సర్పంచ్‌ స్థానాలకు 89 నామినేషన్లు రాగా, వార్డు సభ్యులకు అడవిదేవులపల్లి మండలంలో తక్కువగా 324 వచ్చాయి.

17న ఉపసంహరణ..
నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. కాగా ఈ నెల 14 వ తేదీన పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు స్క్రూటీని చేయనున్నారు. 15వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 16వ తేదీన అభ్యర్థులపై వచ్చిన అభ్యంతరాలను ఆర్డీఓ పరిశీలించి వెల్లడిస్తారు. 17న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుకు గుర్తుల కేటాయింపు ఉంటుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top