కల్తీ కల్లు దొరకక ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
జడ్చర్ల (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లు దొరకక ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ(65) కల్తీ కల్లుకు బానిసైంది.
ఈ క్రమంలో కల్తీ కల్లు లభించకపోవడంతో.. గత నాలుగు రోజులుగా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తోంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించినా లాభం లేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.