సంగీత ఝురి చక్రి హఠాన్మరణం | music dirctor Chakri Died | Sakshi
Sakshi News home page

సంగీత ఝురి చక్రి హఠాన్మరణం

Dec 16 2014 2:36 AM | Updated on Sep 2 2017 6:13 PM

సంగీత ఝురి చక్రి హఠాన్మరణం

సంగీత ఝురి చక్రి హఠాన్మరణం

తెలంగాణ స్వరముత్యం.. ఓరుగల్లు కీర్తి కెరటం.. కోట్లాది హృదయూల ఆత్మబంధువు శ్వాస ఆగింది..!

కంబాలపల్లిలో విషాదం
 
తెలంగాణ స్వరముత్యం.. ఓరుగల్లు కీర్తి కెరటం.. కోట్లాది హృదయూల ఆత్మబంధువు శ్వాస ఆగింది..! చివరి నిమిషం వరకు సంగీత మాధుర్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన స్వరఝురి అలసిపోరుుంది.. పాటల పల్లకి ‘చితి’కింది.. ఉద్దండుల పాటలకు స్వరాలందించిన బాణి మౌన ముద్ర వహించింది.. స్నేహశీలి నేలకొరిగాడు.. అగ్రనాయకులు, యువ హీరోలను అగ్రపథాన నిలిపిన కంఠం మూగబోరుుంది.. మాస్, క్లాస్‌ను తన మెలోడీతో ఉత్తేజ పరిచిన గొంతుక ఆగింది.. చిత్రసీమ చింతించింది.. ఓరుగల్లు ఘొల్లుమంది.. మహబూబూబాద్ బోరుమంది.. కంబాలపల్లి కన్నీళ్లు పెట్టింది.. మహబూబాబాద్ ముద్దుబిడ్డ చక్రి(జిల్లా చక్రధర్) జగమంత కుటుంబాన్ని వదిలి నింగికెగిశాడు.. దీంతో స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులను శోకసంద్రంలో మునిగిపోయారు.. స్వరాల చక్రం మూగబోరుునా.. నీ గానామృతం చిరస్థారుుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని బరువెక్కిన హృదయూలతో నేస్తానికి సెలవు పలికారు.. ఆకాశాన చంద్రుడిగా.. సాగరాన సూర్యుడిగా ఈ గడ్డకు మళ్లీరా.. అంటూ నివాళులర్పించారు.
 - మహబూబాబాద్/హన్మకొండ కల్చరల్     
 
మానుకోట నుంచి ఎదిగిన సంగీత వృక్షం

 
వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించిన చక్రి ఉత్తమ సంగీత దర్శకునిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన ఎంత ఎదిగినా జన్మస్థలాన్ని మాత్రం మరువలేదు. ఈ ప్రాంతంలోని కళాకారులకు తోడ్పాటు అందించారు. చిన్న కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు. ఆయన మరణ వార్త విని స్నేహితులు  శోకసంద్రంలో మునిగిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement