స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా

Munugodu Independent Candidate Venepalli Venkateshwar Rao  - Sakshi

వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు 

సాక్షి,మునుగోడు : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువనున్నట్లు టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత వేనేపల్లి వెంకటేశ్వర్‌ రావు అన్నారు. సోమవారం మునుగోడులో మునుగోడు, నారాయణపురం మండలాల టీఆర్‌ఎస్‌ పార్టీ అసమ్మతి నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చౌటుప్పల్, నాంపల్లి మండలాల కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తే ప్రతి ఒక్కరు ఎన్నికల బరిలో నిలవాలని కోరుతున్నారన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై వ్యతిరేకత కలిసి వస్తుందని, ఆయనకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

అదేవిధంగా మహాకూటమి అభ్యర్థి నేటికీ తేలకపోవడంతో కాస్త శ్రమించి ప్రజల్లోకి వెళ్లి తాను చేయబోయే అభివృద్ధి వివరించి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. అందరి కోరిక మేరకు ఈ నెల 14 న నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాజీ ఎమ్మెల్యే కొందరిపై చేస్తున్న కక్షపూరిత చర్యలను అడ్డుకునేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్‌లు వీరమళ్ల నర్సింహగౌడ్, పందుల నర్సింహ, ముప్ప రవీందర్‌రెడ్డి, జీడిమెట్ల యశోధ, భిక్షం, ఎంపీటీసీ జీడిమడ్ల నర్సమ్మ, యాదయ్య, ఎండీ పాష, కొత్త శంకర్, చలిచీమల యాదగిరి, సైదులు, నాగేందర్, యాదయ్య, వీరేశం, తీగల యాదయ్య, పందుల వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top