తెలంగాణలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పదం

MP Kavitha Pressmeet in Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల: ఆంధ్రాలో రుణ‌మాఫీ చేయడంలో విఫ‌ల‌మైన చంద్రబాబు తెలంగాణలో చక్రం తిప్పుతాననడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. మెట్‌పల్లిలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 

తెలంగాణ‌లో రెండు సంవ‌త్సరాల్లో పూర్తిస్తాయి రుణ‌మాఫీ చేసిన ఘ‌న‌త టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 80 శాతం సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణను ఆంధ్రావారి పాలన నుంచి కష్టపడి తెచ్చుకుంది తిరిగి వారికే అప్పగించడానికి కాదన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ని గెలిపించి తీరుతారని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top