డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు తల్లిని విచక్షణారహితంగా కొట్టిచంపాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలో చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్: డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు తల్లిని విచక్షణారహితంగా కొట్టిచంపాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలో చోటుచేసుకుంది. నడింపల్లి గ్రామానికి చెందిన బోడ జంగమ్మ(52)కు కొడుకు గోపాల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్తలేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఊళ్లోనే ఉంటుంది.
మద్యానికి బానిసగా మారిన గోపాల్ కూలీ పనికివెళ్లి రాత్రి ఇంటికొచ్చి తల్లిని రూ.ఐదువేలు ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె డబ్బులేదని చెప్పడంతో తల్లిపై కక్ష పెంచుకుని ఆమె నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో జంగమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.